అత్తాపూర్ RDOకు నెలరోజుల జైలు
RR: రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ RDOకు కోర్టు ధిక్కరణ కింద నెల రోజుల జైలు, రూ.2వేల జరిమానా విధించింది. పెద్ద షాపూర్‌లోని 74 ఎకరాల భూ వివాదంలో ఉత్తర్వులు జారీ చేయడంలేదని యూసుఫుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు.. సూచించిన టైమ్‌కు ఉత్తర్వులు జారీ చేయలేదని తీర్పునిచ్చింది. జరిమానా చెల్లించకుంటే 2వారాలు శిక్ష పొడిగించాలంది.