శిథిలమైన ఆసుపత్రి.. స్పందించిన బొజ్జిరెడ్డి
ASR; రంపచోడవరం మండలం బూసిగూడెం హెల్త్ సబ్ సెంటర్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవనం శిథిలావస్థలో ఉండి, వర్షానికి మందులు పాడవుతున్నాయని సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన కొత్త భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ, వైద్య సిబ్బంది గిరిజన గ్రామాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.