VIDEO: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు చకచకా ఏర్పాట్లు
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1న శ్రీసీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ఈ మేరకు స్వామివారి కళ్యాణ వేదికను టీటీడీ అధికారులు చకచకా ముస్తాబు చేస్తున్నారు. కళ్యాణ మండపానికి రంగులు కూడా వేస్తున్నారు.