విజయవంతంగా 'రైతన్న మీకోసం' కార్యక్రమం
కృష్ణా: గుడ్లవల్లేరు గ్రామంలో 'రైతన్న మీకోసం' డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి రైతును ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పొట్లూరి రవి అడిగి తెలుసుకున్నారు. రెండు విడతలుగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.