'గాలికుంటు వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి'
ASR: పశువుల్లో గాలికుంటు వ్యాధి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర సూచించారు. శుక్రవారం అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు టీకాలు వేసి, రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.