VIDEO: SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా

VIDEO: SFI ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద విద్యార్థుల ధర్నా

కాకినాడ: కాకినాడలో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ సుమారు 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీ అనంతరం, విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు తమ సమస్యలను విన్నవించారు.