నెరడిగొండలో గ్యాస్ కష్టాలు.. 60 సిలిండర్లకే పరిమితం
ఆదిలాబాద్: నెరడిగొండలోని తిరుమల గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం వినియోగదారులు భారీగా క్యూ కట్టారు. కేవలం 60 సిలిండర్ల స్టాక్ మాత్రమే అందుబాటులో ఉండటంతో ముందుగా వచ్చిన వారికి టోకెన్లు ఇచ్చి పంపిణీ చేశారు. స్టాక్ ముగియడంతో మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు. కాగా కొంతకాలంగా గ్యాస్ కొరత ఉన్న విషయం తెలిసిందే.