VIDEO: సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కొండాపురం మండలంలోని గూడవల్లూరు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సచివాలయం సిబ్బంది ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.