రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డంవారిపల్లి పాత సంత వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.