పాడి రైతులకు సబ్సిడీపై పశువుల దాణా..!
W.G: యలమంచిలి మండలం శిరగాలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద బుధవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు 50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ చేశారు. ఒక్కో బస్తా 60 కిలోల బరువు, రూ. 1110 మార్కెట్ విలువ ఉందని, అందులో ప్రభుత్వ సబ్సిడీ రూ. 555, రైతు భాగం రూ. 555 చెల్లించాలని సొసైటీ ఛైర్మన్ చిలుకూరి బాలాజీ తెలిపారు.