చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
BHPL: జిల్లా కేంద్రంలోని SP కార్యాలయం సమీపంలో ఉన్న బొబ్బగాటి చెరువులో ఇవాళ ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యనా, ఆత్మహత్యనా లేక ప్రమాదవశాత్తా జరిగిందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. మృతుడి గుర్తింపు, మరణ కారణంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.