మైనర్‌పై అత్యాచారం.. భారతీయుడికి జైలు శిక్ష
న్యూజిలాండ్‌లో భారత సంతతికి చెందిన సత్వీందర్ సింగ్ అనే క్యాబ్ డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది. 2023లో తన క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మైనర్‌ను అత్యాచారం చేసినట్లు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. సీసీ కెమెరాల ఆధారంగా సత్వీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. అతడికి ఏడేళ్లకు పైగా జైలు శిక్ష విధించింది.