పోలింగ్ కేంద్రం కిటికీలు చోరీ

పోలింగ్ కేంద్రం కిటికీలు చోరీ

GDL: రాజోలి మండలం ముండ్లదిన్నె గ్రామంలో పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రాథమికోన్నత పాఠశాల కిటికీలను చోరీ చేశారు. ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు కిటికీలను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. సోమవారం పాఠశాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. దీనిపై ఇటు పోలీసులు, అటు ఎన్నికల సిబ్బంది పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు రంగంలోకి దిగారు.