భూముల కోసం మహిళల ఆందోళన
NLR: కావలి మండలం చెన్నయ్యపాలెం, సీతారాంనగర్, నందిమ్మపురం, పెద్దపట్టపుపాలెం గ్రామాల్లో మహిళలు గురువారం ఆందోళన చేపట్టారు. గతంలో తమకు కేటాయించిన భూములను వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఆ భూములను దురాక్రమణ చేసి సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.