మిగుల సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

VSP: విశాఖల గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో మిగుల సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు గురుకులాల కోఆర్డినేటర్ ఎస్.రామకృష్ణ ఆదివారం సబ్బవరంలో తెలిపారు. 5వ తరగతి, ఇంటర్‌లో ఎస్సీ క్యాటగిరిలో మిగిలి ఉన్న సీట్లను భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు నేరుగా సంబంధిత విద్యాలయాలను సంప్రదించాలని కోరారు.