తులం బంగారం ఊసే ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం: MLA

తులం బంగారం ఊసే ఎత్తని కాంగ్రెస్ ప్రభుత్వం: MLA

ASF: కెరమెరి మండలానికి చెందిన 124 మంది లబ్ధిదారులకు MLA కోవ లక్ష్మి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇస్తానన్న 'తులం బంగారం' ఊసే ఎత్తడం లేదని, ఆ వాగ్దానాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.