పత్తి చేను ధ్వంసం చేసిన పలువురుపై కేసు నమోదు

SRCL: అకారణంగా పత్తి చేను ధ్వంసం చేసిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు కోనరావుపేట మండల ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన మండే ఎల్లయ్య అనే రైతుకు చెందిన సుద్దాల గ్రామ శివారులోని సర్వేనెంబర్‌లో ఎకరం 30 గుంటలు ఉండగా అందులో పత్తి చేను సాగు చేస్తున్నాడు. దానిని ధ్వంసం చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.