బాలుర ఆనంద నిలయం తనిఖీ చేసిన జిల్లా అధికారిణి

BDK: భద్రాచలం పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలుర ఆనంద నిలయంను జిల్లా షెడ్యూల్ కులం అభివృద్ధి అధికారిణి శ్రీలత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పిల్లలకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పిల్లల విశ్రాంత గదులు, స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ బాత్రూంలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.