రేపు షాద్ నగర్‌కు శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర
RR: శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర రేపు షాద్ నగర్ సత్యసాయి మందిరానికి చేరుకుంటుందని సత్యసాయి సేవ సమితి కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మందిరం నుంచి పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్ర నిర్వహిస్తామని, మహిళలచే కోలాటాలు, భజనలు ఉంటాయన్నారు. రథయాత్రలో సాయి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.