విజయవాడలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి

NTR: విజయవాడ శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. గొల్లపూడి ఆడుతున్నారన్న స్థానికులు సమాచారం మేరకు దాడి చేశామని ఎస్సై రవితేజ తెలిపారు. ఈ దాడిలో 12 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.15,500 నగదును సీజ్ చేసినట్లు మంగళవారం సాయంత్రం తెలిపారు. వీరందరిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.