యూరియా కోసం రైతుల ఇబ్బందులు

యూరియా కోసం రైతుల ఇబ్బందులు

KNR: సైదాపూర్ మండలం వెన్కెపల్లి విశాల పరపతి సహకార సంఘం వద్ద శనివారం యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సంఘానికి 250 బస్తాల యూరియా లారీ రాగానే రైతులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సహకార సంఘం వద్దకు చేరుకోని వర్షంలో గోడుగులు, కవర్లు కప్పుకుని క్యూలో నిలబడ్డారు. సహకార సంఘం సిబ్బంది ఒక్కోక్క రైతుకు రెండు బస్తాలకు టోకెన్లు అందచేశారు.