'టిడ్కో చెల్లింపుల విషయంలో నమ్మి మోసపోవద్దు'
PPM: టిడ్కో గృహాల నగదు చెల్లింపులో దళారులను నమ్మి ఎవరు మోసపోవద్దని ఎమ్మెల్యే విజయ్ చంద్ర హితవు పలికారు. పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో టిడ్కో గృహాలు లబ్ధిదారులకు త్వరిత గతిన లబ్ధి చేకూరేలా ప్రణాళిక చేసిందన్నారు. 2014-2019 మధ్య మూడు రకాల టిట్కో గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.