వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కణబరచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రాజంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పదవ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులు చదువుతున్న తీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చే వార్షిక పరీక్షలో వంద శాతం ఉత్తర్ణత సాధించాలని, శ్రద్ధ పెట్టి చదవాలని అన్నారు.