లారీ, టిప్పర్ ఢీ

కృష్ణా: గన్నవరం పట్టణ శివారులో విజయవాడ నుంచి ఏలూరు వైపు లోడ్‌తో వెళుతున్న లారీని ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు అక్కడికి చేరుకొని లారీ నుంచి అతడిని బయటికి తీసి హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.