'పత్తి రవిచంద్రకు వైసీపీ కీలక పదవి'

మార్కాపురానికి చెందిన పత్తి రవిచంద్రను వైసీపీ రాష్ట్ర పోలింగ్ బూత్ కమిటీ రాష్ట్ర కార్య దర్శిగా నియమించారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఆయన పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గత ఎన్నికల్లో మార్కాపురం, గిద్దలూరు ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని రవిచంద్ర తెలిపారు.