వేసవి వేళ పేదల ఫ్రిజ్‌లుగా రేగడి రంజన్లు
WGL: ఉమ్మడి జిల్లాలో వేసవి తాపం పెరిగిపోతున్న నేపథ్యంలో రేగడి మట్టితో తయారు చేసిన రంజన్లు, కుండలు పేదల ఫ్రిజ్‌లుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రంజన్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్కో రంజన్ లేదా కుండ రూ.100కు పైగా పలుకుతుండగా, రోజుకు 50 నుంచి 100 వరకు అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు తెలిపారు.