VIDEO: మంత్రి ఇంటి ముందు ఆశ వర్కర్ల ధర్నా

VIDEO: మంత్రి ఇంటి ముందు ఆశ వర్కర్ల ధర్నా

HNK: జిల్లాలోని ఆశా వర్కర్లు మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బైఠాయించి నిరసన తెలిపారు. మంత్రి ఇల్లు ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆశా వర్కర్లు స్పష్టం చేశారు.