వృద్ధురాలు అదృశ్యం

KNR: గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన ఏళ్లపెగూడ మల్లవ్వ(65) అనే వృద్ధురాలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కనిపించడం లేదు. ఆమె తమ్ముడు ఈరవేణి రాయమల్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గంగాధర ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మల్లవ్వను గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.