కామారెడ్డి డీసీసీగా యువ నాయకుడు

కామారెడ్డి డీసీసీగా యువ నాయకుడు

కామారెడ్డి: తెలంగాణ పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి డీసీసీ బాధ్యతలను ఆలే మళ్లికార్ణున్‌కు అప్పగించింది. కాగా జిల్లాలో సీనియర్ లీడర్లు ఉన్నప్పటికీ యువ నాయకుడికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం విశేషం.