VIDEO: కాలువ శుభ్రతకు చర్యలు.. దోమల సమస్యకు చెక్
WGL: వర్ధన్నపేట మున్సిపల్ పట్టణంలోని 11వ డివిజన్‌లో చెరువు నుంచి వచ్చే ఊర కాలువ చెత్త, మట్టితో నిండిపోవడంతో స్థానికులు దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ స్పందించి ఆదివారం జేసీబీ సహాయంతో కాలువ శుభ్రపరిచే పనులు చేపట్టారు. కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.