పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం: కలెక్టర్

పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరం: కలెక్టర్

GDWL: గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులకు పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులకు శుక్రవారం గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన, బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న రెండో దశ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు.