ఈ నెల 7 నుంచి లా కోర్సు ఐదో సెమిస్టర్ పరీక్షలు

వరంగల్: కాకతీయ యూనివర్సటీ పరిధిలో లా కోర్సు లో ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల7 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7, 12, 14, 16, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని గమనించి పరీక్షలకు విద్యార్థులందరు హాజరు కావాలని తెలిపారు.