కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం: మంత్రి
TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి వివేక్ మండిపడ్డారు. గవర్నర్ కోటా MLC కాకపోతే అజారుద్దీన్‌ను MLA కోటా MLC చేస్తామని తెలిపారు. 6 నెలల్లో MLA కోటా MLC స్థానం ఖాళీ అవుతుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు.. అజార్ పదవికి సంబంధం లేదని చెప్పారు. మైనార్టీ కోటాలో భాగంగానే మంత్రి పదవి ఇచ్చామని స్పష్టం చేశారు.