ఛలో హైదరాబాద్‌కు.. ఆశావర్కర్లు అరెస్ట్
TG: బడ్జెట్ సమావేశాల్లో తమకు రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు 'ఛలో హైదరాబాద్'కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు పలువురు ఆశావర్కర్లను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు.