గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల కష్టాలు
GDWL: అలంపూర్‌లో వంట గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు ఎండలో వేచి ఉండాల్సి వస్తోంది. ముందుగా బుక్ చేసుకున్నవారు కూడా ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్ల నీడకు వెళ్ళిపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది దుకాణం తెరవక ముందే సిలిండర్లను వరుసలో పెడుతున్నారని వినియోగదారులు తెలిపారు.