మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గోపిరెడ్డి ఫైర్
AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ పేరుతో టీడీపీ నేతలకు కట్టబెట్టి వందల కోట్లు దోచుకునే కుట్ర జరుగుతోందని మాజీ MLA గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. 50 ఎకరాల మెడికల్ కాలేజీ భూములను కేజీ టమోటా ధరకు సమానంగా అమ్మేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. టీడీపీ నేతలకు కాలేజీలను కట్టబెట్టి వందలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.