IBOMMA రవిని కస్టడీకి అనుమతించిన కోర్టు
HYD: IBOMMA కేసులో అరెస్ట్ అయిన ఇమ్మిడి రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్లో కీలక సూత్రధారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులపాటు రవిని కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో సైబర్ క్రైమ్ పోలీసులు పిటిషన్ వేయగా.. ఐదు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.