రాజ్యాంగ బద్ధ రిజర్వేషన్లపై కలెక్టరేట్ ముట్టడి
NLG: స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.