'మునుగోడులో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉంది'

'మునుగోడులో ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉంది'

NLG: మునుగోడు నియోజకవర్గం ప్రపంచంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతమని స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ట్యాంకుల్లో బోరు, భగీరథ నీళ్లు కలుస్తున్నాయని, దీనికి స్వస్తి పలకాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరందేలా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.