అధ్యక్ష భవనం వద్ద కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు జరగటం కలకలం రేపింది. యూఎస్ నేషనల్ గార్డ్‌లపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్‌లు మృతి చెందారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఆయుధాలు తీసుకుని విచారిస్తున్నారు.