VIDEO: 'కబ్జాకు గురవుతున్న దళితుల భూములను రక్షించాలి'
MNCL: తాండూర్ మండలం అచలాపూర్ గ్రామంలో దళిత భూములను అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వ్యక్తులు కబ్జా చేస్తున్నారని మాదిగ హక్కుల దండోరా నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కుష్ణపల్లి రాజలింగు శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 928 PP 3 ఎకరాల భూమి పైన 145 సెక్షన్ రెవెన్యూ అధికారులు విధించారన్నారు. ఇట్టి భూమిని సాగు చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు.