చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ELR: నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన చల్లా వెంకటరాజు విద్యుత్ షాక్ తగలడంతో వైద్య సేవలు పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రూరల్ ఎస్సై జ్యోతి బసు తెలిపారు. ఈనెల 1వ తేదీన ట్రాన్స్‌పార్మర్ వద్ద పనులు నిర్వహిస్తుండగా షాక్ తగిలింది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నేడు మృతి చెందాడు.