జనగణన ఆధారంగా ప్రభుత్వ పథకాలు: అదనపు కలెక్టర్
KMR: జనగణన ఆధారంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ప్రణాళికలు రూపొందిస్తారని అదనపు కలెక్టర్ మధుమోహన్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఛార్జ్ అధికారులకు నిర్వహించిన మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశంలో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.