VIDEO: నిందితుడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు నిరసన
కోనసీమ: ఐ.పోలవరం మండలం లోని మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అమలాపురంలోని నల్లవంతెన వద్దనున్న జడ్పీ హైస్కూల్ విద్యార్థినిలు ఐద్వా ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దైవ కృప పాల్గొన్నారు.