అన్నా క్యాంటీన్‌ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

SKLM: పలాస -కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోనీ కాశీబుగ్గ ఓల్డ్ బస్టాండ్ రోడ్‌లో గల అన్నా క్యాంటీన్‌ను ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు అకస్మాత్తుగా బ్రేక్ ఫాస్ట్ సమయంలో తనిఖీ చేశారు. క్యాంటీన్లో అప్పటికే అల్పాహారం (టిఫిన్)తింటున్న పబ్లిక్‌ను ఆహార నాణ్యత విషయమై ఆరా తీశారు. సానిటేషన్ పరిస్థితిని పరిశీలించారు.