'ప్రజల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'

'ప్రజల వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది'

BDK: ములకలపల్లి రైతు వేదికలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయనిధి) చెక్కులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ శనివారం పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, తాండ్ర ప్రభాకర్ రావు పాల్గొన్నారు.