VIDEO: 'డ్రైనేజీలో వ్యర్ధాలను తొలగించాలి'
E.G: కొవ్వూరులోని ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. డ్రైనేజీలో ప్లాస్టిక్ బాటిల్స్, వ్యర్థాలతో నీరు ప్రవహించడానికి వీలు లేకుండా ఉంది. వ్యర్థాలు పేరుకుని కుళ్ళిపోవడంతో కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీలో వ్యర్ధాలను తొలగించాలని కోరుతున్నారు.