'సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి'

'సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి'

NLG: చిట్యాల మండలంలో విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఈ రవీందర్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా పాఠశాల సెలవుల నేపథ్యంలో పిల్లలు బయట ఆడుకునేటప్పుడు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గరికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున, పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపారు.