నేటి నుంచి SSC జవాబుపత్రాల మూల్యాంకనం

నేటి నుంచి SSC జవాబుపత్రాల మూల్యాంకనం

KMM: 10వ తరగతి వార్షిక పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం నేటి నుంచి చేపట్టనున్నారు. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు. నేటి నుంచి 15వ తేదీ వరకు వాల్యూయేషన్ కొనసాగుతుందన్నారు. జిల్లాకు 2,32,000 జవాబుపత్రాలు చేరాయని తెలిపారు. విధులు కేటాయించిన ఉద్యోగులు హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.