సిరాజ్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్షమాపణ
మహ్మద్ సిరాజ్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్షమాపణ చెప్పింది. గౌహతి నుంచి HYD వచ్చే విమానం నిన్న రాత్రి ఆలస్యం కావడం, దీనిపై ఎలాంటి సమాచారం రాకపోవడంతో X వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీనికి సదరు ఎయిర్‌లైన్స్ సంస్థ.. ‘అనివార్య కారణాలతో సర్వీస్ రద్దు చేసినందుకు చింతిస్తున్నాం. ప్రయాణికుల పరిస్థితిని అర్థంచేసుకోగలం, క్షమించండి’ అని రిప్లై ఇచ్చింది.